కమల్ వచ్చాడంటున్న బిగ్ బి
|
100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీలతో పాటు భోజ్‌పురి భాషలోను విడుదలైంది. కె.యస్. రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి కమల్ స్వయంగా కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేషీరేష్మానియా సంగీతాన్ని అందించగా, దేవీశ్రీప్రసాద్ నేపథ్య సంగీతాన్ని అందించాడు.
ఈ చిత్రంలో కమల్ బామ్మగా, సింగ్‌గా, బ్రాహ్మణ యువకునిగా అమెరికా అధ్యక్షునిగా... ఇలా పది విభిన్న పాత్రల్లో నటించాడు. అలాగే కమల్‌తో పాటు అశిన్, జయప్రద, మల్లికాషెరావత్ లాంటి అగ్రశ్రేణి కథానాయికలు నటించారు. దశావతారం ఎంతో బావుందని బిగ్ బి అమితాబ్ దగ్గర్నుంచి ఆ చిత్రంలో నటించిన నటీమణులందరూ ముక్త కంఠంతో అంటున్నారు. వారి వ్యాఖ్యలతోపాటు ఆ చిత్రంలోని కొన్ని దృశ్యాలు ట్రెయిలర్ రూపంలో వీక్షించండి.
