"బ్రహ్మానందం డ్రామా కంపెనీ" ట్రైయిలర్
|
చిత్ర దర్శకుడు ఐ. శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ చిత్రంలో నాటక కంపెనీకి అధినేతగా నటించే బ్రహ్మానందంకు ముప్పై ఏళ్ల నాటకరంగ అనుభవం ఉంటుందని అన్నారు. అలాంటి బ్రహ్మానందం తను డ్రామా వేస్తే ఇక ఎవరినీ నిద్ర పోనివ్వడు. ఇలా కథ జరుగుతుండగానే ఆ డ్రామా కంపెనీ నుంచి హీరోయిన్ మిస్ అవుతుంది.
దీంతో ఎవరైతే హీరోయిన్‌ని తెస్తారో వారిని హీరోగా చేస్తానని బ్రహ్మానందం చెప్పడంతో ఓ పిచ్చి అమ్మాయిని తెచ్చి హీరోయిన్‌ని చేస్తారు. అయితే మొదటి హీరోయిన్ ఎందుకు మిస్ అయ్యింది. పిచ్చమ్మాయిని ఎవరు తీసుకొచ్చారు. అనేవి చిత్రంలో ఆసక్తిగా ఉంటాయని శ్రీకాంత్ అన్నారు.
బడ్జెట్ చూడకుండా క్వాలిటీ కోసం పూర్తిగా బ్యాంకాంగ్‌లో నిర్మించిన ఈ చిత్రం, కామెడీతో పాటు యూత్‌పుల్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు మలిచారు. కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైయిలర్స్ రూపంలో మీకోసం..
