1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

"మా ఆయన చంటి పిల్లాడు" ట్రైయిలర్

మీరా మా ఆయన చంటి పిల్లాడు  ట్రైయిలర్
WD
లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం "మా ఆయన చంటి పిల్లాడు". శివాజీ, మీరాజాస్మిన్ భార్యభర్తలుగా నటిస్తున్న ఈ చిత్రంలో సంగీత మరో కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం డీటీయస్ కార్యక్రమాలు జరుపుకుంటోందని దర్శకుడు రాజా వన్నెంరెడ్డి చెప్పారు.

పరస్త్రీ వ్యామోహంలో పడిన భర్తను ఓ ఇల్లాలు ఎలా దారికి తెచ్చుకుంటుందన్న పాయింట్‌తో సినిమాను తెరకెక్కించామని అన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై రెండో వారంలో చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్ర నిర్మాణ సారథి విజయ ప్రకాశ్ తెలిపారు. శ్రీలేఖ అందించిన పాటలు ఇప్పటికే శ్రోతల ఆదరణ పొందాయని అన్నారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT