కళ్యాణ్ రామ్ హరేరామ్ ట్రెయిలర్
|
పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న చిత్రాన్ని ఈనెల 18న విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని నిర్మాత కళ్యాణ్ రామ్ చెప్పారు. ఇది యాక్షన్ కథా నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న చిత్రమని, కథ, కథనం విభిన్నంగా ఉంటుందని, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దామని వెల్లడించారు.
"అతనొక్కడే" చిత్రానికి ఏమాత్రం తీసిపోని సెంటిమెంట్ యాక్షన్ అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయని దర్శకుడు హర్షవర్ధన్ చెబుతున్నారు. ఇటీవలే మయూరి ద్వారా విడుదలైన ఆడియోకు మంచి స్పందన వచ్చిందని పేర్కొన్నారు.
