కమల్ "దశావతారం" ట్రెయిలర్ మీకోసం
|
దాదాపు 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా తమిళం, తెలుగు, హిందీలతో పాటు భోజ్‌పురి భాషలో విడుదలైన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కమల్‌హాసన్ స్వయంగా కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందించడం విశేషం.
ఇకపోతే ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేషీరేష్మానియా సంగీతాన్ని అందించగా, దేవీశ్రీప్రసాద్ నేపథ్య సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలో అసిన్, జయప్రద, మల్లికాషెరావత్ లాంటి అగ్రతారాగణం నటించారు. ఈ చిత్రంలోని కొన్ని దృశ్యాలు ట్రెయిలర్ రూపంలో మీకోసం..
