బాలాదిత్య "వేట" ట్రెయిలర్ మీకోసం..
|
సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు సంబంధించి చక్కని సందేశం చెబుతూ నేటి యువతను ఆకట్టుకునేలా ఉత్కంఠ కలిగించే అంశాలతో రూపొందించామన్నారు. నిర్మాత మాట్లాడుతూ, బాలాదిత్య, స్వాతిప్రియ హీరోహీరోయిన్ల పాత్రలకు చక్కగా కుదిరారని అన్నారు.
పల్లెటూరి నుంచి ఉద్యోగం కోసం వచ్చిన ఓ యువకుడు విలన్ల చేతిలోనుంచి తెలివిగా ఎలా తప్పించుకున్నాడనే కథా నేపథ్యంలో, సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగే ప్రేమ కథా చిత్రం "వేట" అని నిర్మాత పేర్కొన్నారు. శ్రీను, నర్సింగ్ యాదవ్, మల్లాది రాఘవ, జెన్నీ తదితరులు నటిస్తున్న ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రెయిలర్ రూపంలో వీక్షించండి...
