1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

అర్జున్ "రాణా" ట్రెయిలర్ మీకోసం..

అర్జున్
WD
కాజల్, అర్జున్ జంటగా భారతి రాజా దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'రాణా'. అర్జున్ అన్ని సినిమాలాగే ఇది కూడా యాక్షన్ పార్ట్‌తో రూపొందింది. మలేషియా, గోవా, ముంబాయి, చెన్నై‌లలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది.

బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేష్ రిషెమియా ఈ చిత్రానికి సంగీతం అందించడం, హిందీ నటుడు నానా పాటే కర్ ఇందులో నటించడం ఈ సినిమా ప్రత్యేకత. హీరో అర్జున్, హీరోయిన్ కాజల్ మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయని నిర్మాత లక్ష్మీ నారాయణ రెడ్డి తెలిపారు.

మొత్తం మీద "చందమామ" సినిమా తరువాత బిజీ బిజీగా ఉంటున్న కాజల్‌కు అవకాశాలు వెల్లువల్లా వస్తున్నాయి. ఇకపోతే "రాణా" చిత్రానికి కె విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. స్వరాభిషేకం' పరాజయం అనంతరం విశ్వనాధ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మాత్రమే కొనసాగుతున్న నేపథ్యంలో, యాక్షన్ హీరో అయిన అర్జున్‌ను సున్నితమైన భావోద్వేగాలకు పట్టం కడుతారో... లేదో... అన్న విషయం వేచి చూడాల్సిందే. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ట్రెయిలర్ రూపంలో మీకోసం...
About Writer
Selvi