"ఆదివిష్ణు" ట్రెలర్‌ను వీక్షించండి
Publish: Wed, 30 Jul 2008 (12:34 IST)
Updated: Wed, 30 Jul 2008 (12:31 IST)
ఈత కొలనులో ఆదివిష్ణు
సిరిమీడియా ప్రైవేట్ లిమిటెడ్ బేనర్‌పై డాక్టర్. దాసరి నారాయణరావు కుమారుడు దాసరి అరుణ్‌కుమార్ హీరోగా నటిస్తున్న చిత్రం "ఆదివిష్ణు". స్నేహ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా భరత్ పారేపల్లి, పల్లి వేణుగోపాల్‌ల సంయుక్త దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. మనీ, మజిల్ పవర్‌ల మధ్య జరిగే కథాంశంతో తెరకెక్కనున్న "ఆదివిష్ణు" సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవలే తాజ్ డక్కన్‌లో వైభవంగా జరిగింది.
హేపీగా... జాలీగా
ఈ కార్యక్రమానికి సూపర్‌స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరై ఆడియోను ఆవిష్కరించి మోహన్‌బాబుకు అందించారు. దాసరి పద్మ నిర్మాత సారథ్యం వహిస్తున్న ఈ సినిమా ఆడియో సౌభాగ్య మీడియో ఆడియో సంస్థపై విడుదలై రూ.9.90 పైసలకే మార్కెట్లో లభిస్తోంది. ఇకపోతే దాసరి నారాయణరావు కథ, స్త్ర్కీన్‌ప్లే సమకూరుస్తున్నఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీకోసం...