అలీ "సోంబేరి" ట్రైలర్ వీక్షించండి
|
నిర్మాత ఎంతగానో సహకరించారని, రచయితగా దుబాయ్‌లోని పాట తనకు ఎంతో పేరుతెచ్చిందని జొన్నవిత్తుల వెల్లడించారు. నిర్మాత మాట్లాడుతూ... తొలిసారిగా నిర్మాత సారథ్యం వహించిన సోంబేరి తనకెంతో ఆనందాన్నిచ్చిందని, ప్రేక్షకుడిలా థియేటర్లలో చూశామని, వారి స్పందన ఎంతో బాగుందని అన్నారు.
నిర్మాణ నిర్వాహకుడు పి,ఎస్. రామచంద్రుడు మాట్లాడుతూ... సంగీతపరంగా మనోకి ఎంతగానో పేరు తెచ్చిందని, సాంకేతిక పరంగానూ మంచి వాల్యూస్ ఉన్న చిత్రమిదని, 21 ప్రింట్లతో రిలీజ్ చేశామని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రం ఇప్పటికి కలెక్షన్లు నిలకడగా ఉన్నాయని, పది సెంటర్లలో యాభైరోజులు ఆడుతోందని రామచంద్రుడు అన్నారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీకోసం...
