విశాల్ నయనతారల సెల్యూట్ ట్రెయిలర్
|
నయనతార, విశాల్ సెల్యూట్
చురుకైన నటుడు విశాల్ హీరోగా, సెక్సీ తార నయనతార జంటగా నటించిన చిత్రం సెల్యూట్. ఎ.రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం స్వాతంత్రదినోత్సవ కానుకగా ఆగస్టు 15న ప్రేక్షకులకు కనువిందు చేయనుంది.
'పందెంకోడి' చిత్రంతో తెలుగువారికి పరిచయమైన విశాల్ ఆ తర్వాత 'పొగరు' చిత్రంతో తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. అందుకే ఇప్పటివరకు తమిళంలో నటించిన విశాల్ ఈసారి సెల్యూట్‌తో డైరెక్టుగా తెలుగు వెండితెరపైకి రానున్నాడు.
|
శృంగార దృశ్యంలో నయనతార, విశాల్
ఈ సెల్యూట్ చిత్రం తెలుగులో, తమిళంలో ఒకేసారి రూపొందింది. విశాల్, నయనతార నటించిన ఓ పాటలోని సన్నివేశాలు ఎంతో హాట్ హాట్‌గా వుంటాయి. చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్ మీకోసం...
