1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

"సిద్ధు ఫ్రమ్ సికాకుళం" ట్రైలర్ మీకోసం...

వినోదం వెండితెర ట్రైలర్స్ అల్లరి నరేష్ హీరో మంజరి  హీరోయిన్లు వెల్ఫేర్ క్రియేషన్స్ పతాకం సిద్ధు ఫ్రమ్ సికాకుళం
WD
అల్లరి నరేష్ హీరోగా, మంజరి, శ్రద్ధాదాస్ హీరోయిన్లుగా, వెల్ఫేర్ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'సిద్ధు ఫ్రమ్ సికాకుళం'. ముళ్ళ విజయప్రసాద్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా ఐదు షెడ్యూళ్లను పూర్తి చేసుకుంది. ఇప్పటికే హీరో నరేష్ 25 చిత్రాల్లో నటించినప్పటికీ ఇప్పటివరకు కాలేజీ స్టూడెంట్ పాత్రలో నటించలేదు. తొలిసారిగా ఈ సినిమాలో అల్లరి నరేష్ కాలేజ్ స్టూడెంట్ పాత్ర పోషిస్తున్నారు.

ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ... సినిమా తీయాలనే ఆసక్తితో రియల్ ఎస్టేట్ రంగం నుంచి ఈ రంగంలోకి అడుగుపెట్టానని చెప్పారు. పూర్తిస్థాయిలో వినోదభరితంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామన్నారు. టైటిల్ కోసం నాలుగు నెలలు ప్రయత్నించామని చెప్పారు.

దర్శకుడు ఈశ్వర్ ఈ సినిమాను చక్కగా తెరకెక్కిస్తున్నారని, రెండు పాటలు మినహా సినిమా షూటింగ్ పూర్తయిందని నిర్మాత అన్నారు. త్వరలో సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు.

సికాకుళం నుంచి సిద్ధు పట్టణానికి ఎందుకు వచ్చాడు, అక్కడ అతనికి ఎదురైన అనుభవాలనే చిత్రంగా మలిచామని దర్శకుడు తెలిపారు. వేణుమాధవ్, చంద్రమోహన్, ధర్మవరపు, జయప్రకాష్‌రెడ్డి, విజయరంగరాజు, అమిత్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీకోసం...