1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

రామ్, జెనీలియాల "రెడీ" ట్రైలర్ మీకోసం

వినోదం వెండితెర ట్రైలర్స్ రామ్
WD
విజయవంతమైన ఢీ, దుబాయ్ శ్రీను చిత్రాల తర్వాత దర్శకుడు శ్రీనువైట్ల రూపొందించిన చిత్రం "రెడీ.." (దేనికైనా). రామ్, జెనీలియా జంటగా ఈ సినిమాను 160 ప్రింట్లతో రిలీజ్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన పాటలు హిట్ కావడంతో పాటు సినిమా విడుదలై విజయవంతంగా 50వ రోజుకు చేరుకుంది. లవ్, యాక్షన్ మేళవింపుతో శ్రీనువైట్ల రూపొందించిన ఈ సినిమాలో పీటర్ హెయిన్స్ సమకూర్చిన ఫైట్స్ హైలైట్‌గా నిలిచాయి.

ఇక కథ ఏమిటంటే... 'రెడీ'లో రామ్ బళ్లారికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిగా నటించారు. కథ ప్రకారం అతనిది ఉమ్మడి కుటుంబం. ఒకసారి అతను పనిమీద హైదరాబాదుకు రావడం, అక్కడ అమెరికా నుంచి వచ్చిన ఎన్నారై అమ్మాయి జెనీలియా పరిచయం కావడం, తర్వాత ఆ ఇద్దరూ ప్రేమలో పడటం జరుగుతుంది.

అయితే జెనీలియా ప్రేమతో చిక్కుల్లో పడిన రామ్, వాటిని ఎలా ఎదుర్కొని తన ప్రేమను గెలిచాడనేది మిగిలిన కథ. మొత్తానికి రామ్, జెనీలియా, శ్రీనువైట్ల కాంబినేషన్ ప్రేక్షకుల మధ్య మంచి హైప్‌ని క్రియేట్ చేస్తోంది.

స్రవంతి రవికిషోర్ నిర్మించిన ఈ బ్రహ్మానందం, నాజర్ సుధ, కోట శ్రీనివాసరావు, షఫి, జయప్రకాష్ రెడ్డి, తనికెళ్ళ, నవదీప్, తమన్నా తదితరులు నటించారు. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై విడుదలై థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తున్న "రెడీ" సినిమాలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీకోసం...