"కథానాయకుడు" ట్రైలర్‌ను వీక్షించండి
|
మంచి మిత్రుడనే వాడు ఎలా ఉండాలనే విషయాన్ని రజనీ కాంత్ ఈ సినిమా ద్వారా చెప్పారు. మంచి మిత్రుడు దేవుడిచ్చిన వరం... అనే బెర్నార్డ్ షా మాటల్ని స్ఫూర్తిగా తీసుకుని అల్లిన కథే ఈ "కథానాయకుడు".
ఇకపోతే తల్లిదండ్రుల తర్వాత గురువు అన్నారని, కానీ మిత్రుడు అని పెద్దలు ఎందుకు అనలేదో తెలియదు గానీ, తన దృష్టిలో గురువు స్థానం మిత్రుడిదేనని, ఆ తర్వాతే దైవమంటూ క్లైమాక్స్ సన్నివేశంలో రజనీ కాంత్ ఇచ్చే డైలాగ్స్ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. నయనతార, మమతా మోహన్‌దాస్, జగపతిబాబు, మీనా, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సునీల్, ఎం.ఎస్.నారాయణ తదితరులు నటించిన ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
