1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

"ఆదివిష్ణు" ట్రైలర్‌ను వీక్షించండి

వినోదం వెండితెర ట్రైలర్స్ దాసరి నారాయణ రావు కుమారుడు దాసరి అరుణ్ కుమార్ హీరో స్నేహ హీరోయిన్‌ ఆదివిష్ణు
WD
దాసరి నారాయణ రావు కుమారుడు దాసరి అరుణ్ కుమార్ హీరోగా, అందాల భామ స్నేహ హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం "ఆదివిష్ణు". షూటింగ్‌ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన ఈ సినిమా 150 థియేటర్స్‌లో అత్యథిక ప్రింట్లతో ఆగస్టు 21న రాష్ట్రవ్యాప్తంగా లాంఛనంగా రిలీజ్ కానుంది.

అన్ని తరగతులవారు ఆకట్టుకునే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందని దర్శకుడు పారేపల్లి భరత్ వెల్లడించారు. ఇకపోతే ఈ సినిమాకు దర్శకరత్న డా. దాసరి నారాయణరావు కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు సమకూర్చారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఆడియోకు విశేష స్పందన లభించిందని, సినిమా విడుదలకు ముందే నాలుగు లక్షల ఆడియో సి.డిలు సేల్స్ అయి సంచలనం సృష్టించిందన్నారు. అదేవిధంగా వినోదం, యాక్షన్ అంశాలతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా హిట్ అవుతుందని నమ్మకం ఉందని దర్శకుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సినిమా ప్రతీ సన్నివేశానికి తర్వాత ఏం జరుగుతుందనే సస్పెన్స్‌‌ను ప్రేక్షకుడిలో కలిగిస్తుందని వెల్లడించారు. ఈ సినిమా హీరో అరుణ్‌కి పెద్ద పేరుని, దర్శకుడిగా తనకు గుర్తింపును తెచ్చిపెడుతుందని దర్శకులు ఆకాంక్షించారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీకోసం...
About Writer
Selvi