"సెల్యూట్" ట్రైలర్‌ను వీక్షించండి
|
జీకే ఫిలింస్ కార్పొరేషన్ పతాకంపై విక్రమ్‌కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించగా, ఎ రాజశేఖర్ దర్శకత్వం వహించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఈ సినిమాను ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆదరిస్తారని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
ఇకపోతే విశాల్ పోలీస్ కమీషనర్ పాత్ర పోషణకు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారట. ఈ పాత్రను చూసిన పోలీసులు తప్పనిసరిగా సెల్యూట్ అనే విధంగా చిత్రీకరించినట్లు నిర్మాత వెల్లడించారు.
పోలీసు పవర్ అంటే ఏమిటో చూపుతూ, పోలీసు పట్ల మరింత గౌరవాన్ని పెంచే పాత్రలో విశాల్ చక్కగా నటించారు. ఇంకా కోట శ్రీనివాసరావు, సుధాచంద్రన్, రవికాలె, బ్రహ్మానందం, అలీ, తణికెళ్లభరణి, హేమ, అపూర్వ తదితరులు నటించిన ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీకోసం...
