"కొత్త బంగారు లోకం" ట్రైలర్ మీకోసం
|
హీరో తండ్రిగా ప్రకాష్ రాజ్ నటిస్తున్నారని, ఆర్య, బొమ్మరిల్లు, ఠాగూర్ లాంటి హిట్ చిత్రాలనందించిన శ్రీకాంత్ మరో హిట్ చిత్రం తీయబోతున్నట్లు చెప్పారు. హ్యాపీడేస్‌లో ప్రేక్షకులు ఎలా ఫీల్ అవుతారో ఈ కుటుంబ కథా చిత్రాన్ని చూస్తున్నంత సేపు అలాగే ఫీలవుతారని దిల్ రాజు వివరించారు.
ఈ చిత్రంలో దాదాపుగా కొత్త నటీనటులను పరిచయం చేస్తున్నామని, అలాగే హీరోయిన్‌గా కొత్త అమ్మాయి పరిచయం అవుతోందని తెలిపారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి డిసెంబర్‌లో షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నామన్నారు. "హరేరామ్"కు సంగీతం సమకూర్చిన మిక్కీ జే మేయర్ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి
