"బ్యాంక్" సినిమా ట్రైలర్‌ను వీక్షించండి
|
ఈ సినిమా గురించి జాకీష్రాఫ్ మాట్లాడుతూ.. తాను చేసిన తొలి తెలుగు సినిమా "అస్త్రం" అని, ఆ తర్వాత అరుణ్ ఈ స్క్రిప్టుని వినిపించగానే బాగా నచ్చి, వెంటనే అంగీకరించానని చెప్పారు. రాహుల్‌దేవ్ చక్కని నటుడని, అర్చన ఈ సినిమాలో బాగా చేసిందని తెలిపారు. అబ్బాస్ తన పాత్రకు న్యాయం చేశారని, ఈ సినిమాలో బ్యాంక్ దోపిడీలనీ ప్లాన్ చేసే విలన్ పాత్రను తాను చేసినట్లు చెప్పుకొచ్చారు.
దర్శక నిర్మాత అరుణ్ మాట్లాడుతూ... మొదట ‘బ్యాంక్’ సినిమాకు నిర్మాణ సారథ్యం వహించాలని అనుకున్నప్పటికీ, తర్వాత ఈ కథకి తానైతేనే న్యాయం చేయగలననిపించి దర్శకత్వం చేస్తున్నానని చెప్పారు.
గేయ రచయిత చిన్నిచరణ్‌ని సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నట్లు వెల్లడించారు. అర్చన మాట్లాడుతూ ‘బ్యాంక్’లో తాను చేసిన పాత్ర అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నానన్నారు.
