1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

"అవతారుడు" సినిమా ట్రైలర్‌ను వీక్షించండి

వినోదం వెండితెర ట్రైలర్స్ అజిత్ హీరో తమిళం ఘనవిజయం శాలినీ సినీ క్రియేషన్స్
WD
అజిత్ హీరోగా తమిళంలో ఘనవిజయం సాధించిన ఆళ్వార్ చిత్రాన్ని తెలుగులో "అవతారుడు" పేరుతో తెరకెక్కించనున్నారు. శాలినీ సినీ క్రియేషన్స్ పతాకంపై, యస్.యస్. సెల్వ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అసిన్ హీరోయిన్‌గా నటించింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఈ చిత్రంలో హీరో అజిత్ అనేక రకాలైన గెటప్స్‌లో నటించారని తెలిపారు. అందువల్లే ఈ చిత్రానికి అవతారుడు అనే పేరును ఖరారు చేశామని తెలిపారు.

ఈ చిత్రంలోని ఐదు పాటలను విదేశాల్లో చిత్రీకరించారని, శ్రీకాంత్ దేవా అందించిన సంగీతం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు.

అన్ని కార్యక్రామాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన వివరించారు. దుష్టులను అంతమొందించే ఓ యువకుని కథాంశంగా రూపుదిద్దుకుంటున్న "అవతారుడు" సినిమాలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీకోసం...