శివాజీ "ఆలయం" ట్రైలర్ మీకోసం
|
చిత్ర నిర్మాత మాట్లాడుతూ... ఆప్యాతలు నిండిన కుటుంబంలో అనుకోకుండా ఓ చిచ్చు రగిలితే దాని పర్యవసానం ఎలా ఉంటుందనే విషయం ఈ చిత్రంలో చూపించామని అన్నారు. ఈ చిత్రానికి కోటి స్వరాలు, వనమాలి, అనంత్‌శ్రీరామ్ అందించిన సాహిత్యం చక్కగా అమరిందని తెలిపారు. ఈ సినిమాలో కె.బి. తిలక్ చక్కని పాత్ర పోషించారని, పలు హాస్యనటులు ఈ సినిమాలో విభిన్న పాత్రలు పోషించారని అనూప్ వెల్లడించారు.
అద్భుతమైన కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ సినిమా అన్ని వర్గాలకు చెందిన ప్రేక్షకుల ఆకట్టుకుందని దర్శకుడు ముత్యాల సుబ్బయ్య ఆశాభావం వ్యక్తం చేశారు.
