"అష్టాచమ్మా" ట్రైలర్ మీకోసం...
నాని, శ్రీనివాస్, భార్గవి, స్వాతి, తనికెళ్ళభరణి, ఝాన్సీ తదితరులు నటించిన చిత్రం "అష్టాచమ్మా". రామ్మోహన్ నిర్మాతగా ఇంద్రగంటి మోహనకృష్ణ నిర్మించిన ఈ చిత్రాన్ని తనే విడుదల చేసేందుకు "హ్యాపీడేస్" దర్శకుడు శేఖర్ కమ్ముల ముందుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిత్ర నిర్మాత రామ్మోహన్ ఈ చిత్రం చూసి జడ్జిమెంట్ చెప్పమని అడిగితే... చూసిన తర్వాత కొత్తతరహా కథతో తెరకెక్కించారనిపించిందని అన్నారు.
దర్శకుడిగా ఇంద్రగంటి మోహన్‌కృష్ణ కొత్తబాటలో పయనించారని, కామెడీ కూడా కొత్తరీతిలో ఉందని, బ్రహ్మానందం, అల్లరి నరేష్ వంటివారెవరూ లేకుండా కేవలం కొత్తవారితోనే కావాల్సినంత కామెడీ పండించారని చెప్పారు. ఇందులో పాత్రలన్నీ సెల్‌ఫిష్‌గా ఉంటాయని, వారి నటనకూడా సహజత్వంగా ఉందని, కళ్యాణి మాలిక్ సంగీతం బాగుందని, అందుకే ఈ చిత్రాన్ని స్వంత డిస్ట్రిబ్యూషన్ అయిన "టూరింగ్ టాకీస్" ద్వారా ఓవర్ సీస్‌లో విడుదల చేస్తున్నానని పేర్కొన్నారు.
చిత్ర సమర్పకుడు డి. సురేష్‌బాబు మాట్లాడుతూ.. ఈ చిత్రం ఇప్పటికే సెన్సార్‌ను పూర్తి చేసుకుందని, సెప్టెంబర్ 5న విడుదల చేస్తున్నామని చెప్పారు. దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ మాట్లాడుతూ.. ఈ చిత్రం ద్వారా ప్రతిభగల నటీనటుల్ని పరిచయం చేశానని, సీనియర్ నటీనటులతో బెరులేకుండా నటించారని తెలిపారు. సిరివెన్నెల సాహిత్యానికి కళ్యాణిమాలిక్ సంగీతం చాలా బాగా అమరిందని, ఇది పూర్తి రొమాంటిక్ కామెడీ చిత్రమని, మరుగుపడిన అష్టాచమ్మా ఆటను ఈ చిత్రంద్వారా వెలుగులోకి తెస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు.