1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

"మల్లెపువ్వు" ట్రైలర్‌ను వీక్షించండి

వినోదం వెండితెర ట్రైలర్స్ మురళీ కృష్ణ భూమిక హీరోహీరోయిన్లు మల్లెపువ్వు
WD
మురళీ కృష్ణ, భూమిక హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం "మల్లెపువ్వు". ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం సమకూర్చడం, అందాల ముద్దుగుమ్మ ఫర్జానా ఐటం సాంగ్ చేయడం ఈ సినిమా ప్రత్యేకాంశాలు. ఈ చిత్రాన్ని ఈ నెల 18న విడుదల చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు వి. సముద్ర వెల్లడించారు.

మోహన్ వడ్లపట్ల నిర్మాణ సారథ్యం వహిస్తున్న ఈ సినిమా.. ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించిందని, "మల్లెపువ్వు" కూడా ప్రేక్షకులను అలరిస్తుందని దర్శకుడు వి. సముద్ర ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సినిమాలో భూమిక కీలక పాత్ర పోషించిందని, ఆమె కెరీర్‌లో "మల్లెపువ్వు" మంచి సినిమా అవుతుందని అన్నారు. హీరోగా పరిచయం అవుతున్న మురళీ కృష్ణ పాత్రకు చక్కగా అమరారని తెలిపారు. ఇంకా ఈ సినిమాకు పాటలు... వేటూరి, కథ.. రమేష్ వర్మ, ఛాయాగ్రహణం... అనిల్ భండారి. లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న "మల్లెపువ్వు"ను ట్రైలర్‌లో తిలకించండి.
About Writer
Selvi