"బ్లాక్ అండ్ వైట్" ట్రైలర్ మీకోసం...
రాజీవ్కనకాల, సింధూతులానీ జంటగా 'బ్లాక్ అండ్ వైట్' చిత్రం ఇటీవలే తెరకెక్కింది. శ్రీకాంత్ వేములపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాకీషాఫ్ర్ ఓ ముఖ్యపాత్రను పోషించారు. ఈ చిత్రం విశేషాల గురించి దర్శకుడు మాట్లాడుతూ వైవాహిక జీవితంలో అనుకోకుండా జరిగే సంఘటనల నేపథ్యంలో చిత్ర కథ నడుస్తుందని తెలిపారు. ఈ చిత్రంలో జాకీషాఫ్ర్ సీబీఐ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్టు తెలిపారు. ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను కేవలం వాణిజ్యపరంగానే గాక మంచి సందేశాత్మకంగా చిత్రీకరించామని దర్శకులు వెల్లడించారు. రీరికార్డింగ్‌కు ఎక్కువ అవకాశం ఉన్న కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో రాజ్‌భరత్, సందేశ్, జీవా, ఉత్తేజ్, అలీ.. తదితరులు నటిస్తున్నారు. విజయ్ కురాకుల సంగీతం అందించిన ఈ సినిమాకు సంబంధించిన కొన్ని దృశ్యాలను ట్రైలర్‌లో చూడండి.