1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

"హరేరామ్‌"ను ట్రైలర్‌లో తిలకించండి

వినోదం వెండితెర ట్రైలర్స్ కళ్యాణ్రామ్ ప్రియామణి హీరోహీరోయిన్లు హర్షవర్ధన్ దర్శకత్వం నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకం
WD
కళ్యాణ్‌రామ్, ప్రియామణి హీరోహీరోయిన్లుగా హర్షవర్ధన్ దర్శకత్వంలో నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కిన చిత్రం "హరేరామ్". ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంపై రూపొందిన 'హరేరామ్' కథ, కథనం విభిన్నంగా ఉంటుందని, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుందని కళ్యాణ్ రామ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా, యాక్షన్ కథా నేపథ్యంలో రూపుదిద్దుకుని తెరకెక్కిన "హరేరామ్" యూత్‌ను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటోంది. "అతనొక్కడే" చిత్రానికి ఏమాత్రం తీసిపోని సెంటిమెంట్, యాక్షన్ అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయని దర్శకుడు హర్షవర్ధన్ చెబుతున్నారు. ఇకపోతే... మయూరి ద్వారా విడుదలైన ఆడియోకు మంచి స్పందన వచ్చిన ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీకోసం...
About Writer
Selvi