1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

సస్పెన్స్ థ్రిల్లర్ త్రీ ట్రైలర్ మీకోసం...

వినోదం వెండితెర ట్రైలర్స్ రిషి రాజీవ్కనకాల శాంతిచంద్ర హీరోలు ఊర్వశీశర్మ హీరోయిన్ త్రీ శేఖర్సూరి దర్శకత్వం
WD
రిషి, రాజీవ్‌కనకాల, శాంతిచంద్ర హీరోలుగా, ఊర్వశీశర్మ హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం "త్రీ". శేఖర్‌సూరి దర్శకత్వంలో రాజ్ (ఇండియా) ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఫణిరాజ్, జీఎస్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తన స్నేహితుని జీవితంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించామని చిత్ర దర్శకుడు వెల్లడించారు. సరికొత్త థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోందని చెప్పారు. సాంకేతికంగా అత్యున్నత విలువలతో చిత్రీకరించామని, ఛాయాగ్రహణం, సంగీతం ఈ సినిమాకు అదనపు బలాలని తెలిపారు.

నిర్మాతలు మాట్లాడుతూ, ఖచ్చితంగా హాలీవుడ్ సినిమాను చూసిన అనుభూతిని ప్రేక్షకులకు కలిగిస్తుందన్నారు. తెలుగులోనే తొలిసారిగా బెలూన్‌రైట్‌లో చిత్రీకరణ జరిపామని తెలిపారు. ఖర్చు విషయంలో వెనుకాడకుండా భారీ బడ్జెట్‌తో రూపొందించామన్నారు. కథకథనాలు వైవిధ్యంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీ కోసం...
About Writer
Selvi