1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

"వినాయకుడు" ట్రైలర్‌ను వీక్షించండి

వినోదం వెండితెర ట్రైలర్స్ ప్రేమ్ మూవీస్ పతాకం సాయికిరణ్ దర్శకత్వం కృష్ణుడు సోనియా జంట
WD
ప్రేమ్ మూవీస్ పతాకంపై సాయికిరణ్ దర్శకత్వంలో కృష్ణుడు, సోనియా జంటగా నటిస్తోన్న చిత్రం "వినాయకుడు". సరితా పట్రా నిర్మాణ సారథ్యం వహిస్తోన్న ఈ చిత్రం... అందరికీ నచ్చే విధంగా ఉంటుందని, వినోదాన్ని పుష్కలంగా పండిస్తుందని సమర్పకుడు ప్రేమ్ కుమార్ వెల్లడించారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు హత్తుకునేలా ఉంటాయని చెప్పారు.

శ్యామ్ ప్రసన్ సంగీతం వీనుల విందుగా ఉంటుందని, ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని నిర్మాణానంతర కార్యక్రమాలను ముగించుకుని త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రేమ్ కుమార్ తెలిపారు. రొమాన్స్, కామెడీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కనుందని ఆయన అన్నారు. ఈ సినిమా ఆడియో వేడుక వినాయకచవితి రాత్రి శిల్పకళామందిరంలో వినూత్నంగా జరిగింది.

చిత్ర నిర్మాత ప్రేమ్ కుమార్ తనయుడు ప్రధాన్ గణేశుని వేషధారణతో వేదికపైకి వచ్చి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ఆరంభించారు. ముఖ్య అతిథి సంగీత దర్శకుడు కీరవాణి క్యాసెట్‌ను విడుదల చేయగా, బిల్డర్ కృష్ణప్రసాద్ కేసెట్ కొనుగోలు చేశారు. సీడీని బొమ్మరిల్లు దర్శకుడు భాస్కర్ విడుదల చేయగా నటుడు వరుణ్ అందుకున్నారు.
About Writer
Selvi