1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

"నేను మీకు తెలుసా?" ట్రైలర్ మీ కోసం...

వినోదం వెండితెర ట్రైలర్స్ మోహన్బాబు రెండో కుమారుడు మనోజ్ హీరో  సోనీ డిజిటల్స్ ఆడియో
WD
మోహన్‌బాబు రెండో కుమారుడు మనోజ్ హీరోగా నటిస్తున్న చిత్రం "నేను మీకు తెలుసా". ఈ సినిమా ఆడియో సోనీ డిజిటల్స్ ద్వారా మార్కెట్‌లోకి విడుదలైంది. ఈ పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించిందని నిర్మాత వెల్లడించారు. ఈ చిత్రానికి శ్రీమతి లక్ష్మీప్రసన్న నిర్మాత కాగా, అజయ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సందర్భంగా సినిమా దర్శకుడు అజయ్ శాస్త్రి మాట్లాడుతూ... ఈ కథను తాను మనోజ్‌కు చెప్పినప్పుడే.. వాళ్ల నాన్నవద్దకు తీసుకెళ్లారని, చాలా భయపడ్డానని, అయితే మోహన్‌బాబు తనతో సినిమా చేసేందుకు అంగీకరించారని, తనకు ఈ సినిమా పట్ల పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని చెప్పుకొచ్చారు.

నిర్మాత మంచు లక్ష్మి మాట్లాడుతూ... ఈ సినిమాకు తాను పేరుకు మాత్రమే నిర్మాతనని.. అంతా మనోజ్ చూసుకుంటున్నారని వెల్లడించారు. తాము చేసిన ఈ ప్రయత్నం సఫలీకృతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సినిమాలో మనోజ్ సరసన స్నేహ ఉల్లాల్ నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని సెప్టెంబరులో విడుదల చేయనున్నట్లు దర్శకులు చెప్పారు. బ్రహ్మానందం, నాజర్, సునీల్, సురేఖారాణి నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు... కిషోర్, కెమెరా...సునీల్ కె. రెడ్డి, సంగీతం.. అచ్చు, సమర్పణ... మోహన్‌బాబు, నిర్మాత మంచు లక్ష్మి. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో తిలకించండి.
About Writer
Selvi