"గోరింటాకు" సినీ ట్రైలర్‌ను తిలకించండి
|
సూపర్‌గుడ్ ఫిలింస్ పతాకంపై ఈ సినిమా రూపుదిద్దుకుంది. చిత్ర సమర్పకుడు ఆర్‌బీ చౌదరి మాట్లాడుతూ.. ఇప్పటికే అనేక కుటుంబ కథాచిత్రాల్లో నటించిన రాజశేఖర్ గోరింటాకులో ఒక ఉన్నతమైన పాత్రను పోషించారని చెప్పారు. అన్నాచెల్లెళ్ల మధ్య అనురాగాన్ని రాజశేఖర్, మీరాజాస్మిన్ చక్కగా పండించారని తెలిపారు.
ఎస్ఏ రాజ్‌కుమార్ సంగీతానికి మంచి ఆదరణ లభించిందని పారస్‌జైన్ చెప్పారు. ఆదిత్యా ద్వారా విడుదలైన ఆడియోకు మంచి స్పందన వచ్చిందని, త్వరలో ప్లాటినం డిస్క్ వేడుక జరపుతామన్నారు. రాజశేఖర్ హీరోగా తాము ఇంతకుముందు నిర్మించిన సింహరాశి మాదిరిగానే కొత్త చిత్రం కూడా ఘనవిజయం సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. సరే... అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని ట్రైలర్ రూపంలో వీక్షించండి...మరీ.
