జగపతిబాబు హోమం ట్రైలర్ మీకోసం..
|
ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ... ఇటీవల తమ డిస్ట్రిబ్యూషన్ నుంచి బయటకు వచ్చిన "హ్యాపీడేస్" "ఉల్లాసంగా ఉత్సాహంగా" సినిమాలు ఆదరణ పొందడంతో చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు.
అంత ఉత్సాహంగానే "హోమం" చిత్రాన్ని ఆంధ్రా అంతా రిలీజ్ చేస్తున్నానని తెలిపారు. డబుల్ పాజిటివ్‌లోనే సినిమాను చూశానని, ఇందులో జె.డి చక్రవర్తి అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పారు.
పేరు "హోమం" అయినా మ్యాజిక్ కూడా బాగుందన్నారు. సినిమాకు చక్రి చక్కని సంగీతాన్ని సమకూర్చారన్నారు. జె.డి చక్రవర్తి మాట్లాడుతూ... ఈ చిత్రాన్ని చూడకుమందు దిల్‌రాజుగారు ఇది పూర్తి యాక్షన్ సినిమా అన్నారని చెప్పారు.
కానీ చూశాక మనస్సు మార్చుకుని లవ్, మ్యూజికల్, ఎమోషనల్ సినిమా అని అన్నారని తెలిపారు. ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందనే నమ్మకముందని తెలిపారు. పోలీసులకు, మాఫియాలకు మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో సాగే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ ద్వారా తిలకించండి.
