గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » ట్రైలర్స్ » "హోమం" ట్రైలర్‌ను తిలకించండి
ట్రైలర్స్
Feedback Print Bookmark and Share
 
WD
తెలుగు పరిశ్రమ గొప్ప అంచనాలతో ఎదురుచూసిన హాట్ సినిమా "హోమం". ఈ సినిమాకో ప్రత్యేకత ఉంది. అదేమిటంటే... నటుడు జె.డి.చక్రవర్తి విలన్‌గా నటిస్తూనే హీరో జగపతి బాబుని డైరక్ట్ చేయడమే. అలాగే జగపతి బాబుకి జోడీగా గాయని, నటి అయిన మమతామోహన్ దాస్ కన్పిస్తుంది.

హాలీవుడ్ హిట్ 'డిపార్టెడ్' ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా మాఫియా వారికి పోలీసులకి మధ్య జరిగే గేమ్‌గా ఊహించని ట్విస్టులతో ప్రేక్షకుడిని థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఇక నిన్నటి హీరోయిన్ సాక్షి శివానంద్ ఈ చిత్రంలో.. ఓ ఐటం సాంగ్‌లో కనపడి యువతను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది.

ఇలా.. అన్ని హంగులతో నిండిన "హోమం" సినిమాలో... పోలీసు అవ్వాలనే లక్ష్యంతో ఉండే వ్యక్తి పాత్రను జగపతిబాబు అద్భుతంగా పోషించారు. విశ్వనాథం (ప్రదీప్‌రావత్) పోలీసు అధికారిగా నటించారు. కథా పరంగా... హైదరాబాద్‌లో ఎన్నో అరాచకాలు చేసినప్పటికీ, సరైన సాక్ష్యాలు లేకపోవడంతో ఒక ముఠా నాయకుడు డాడీ (మహేష్ మంజ్రేకర్)ని విశ్వనాథం అరెస్టు చేయలేకపోతాడు.

తన చీకటి సామ్రాజ్యానికి అడ్డులేకుండా చేసుకోవడానికి డాడీ కూడా ఒక వ్యక్తిని పోలీసు డిపార్ట్‌మెంట్‌లో నియమిస్తాడు. ఈ పాత్ర పేరు చందు (జేడీ చక్రవర్తి). ఈ పాత్రలో చక్రవర్తి చక్కగా అమరారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ ద్వారా తిలకించండి
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర ట్రైలర్స్ హోమం జెడిచక్రవర్తి జగపతి బాబు మమతామోహన్ దాస్