1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

లక్ష్యం జంటను "శౌర్యం" ట్రైలర్లో తిలకించండి

వినోదం వెండితెర ట్రైలర్స్ గోపిచంద్ అనుష్క హీరోహీరోయిన్లు శౌర్యం సెప్టెంబర్ 24
WD
"లక్ష్యం" జంట గోపిచంద్, అనుష్క హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం "శౌర్యం". ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. శివకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆనంద్ ప్రసాద్ నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ఆడియో ఇటీవలే వినూత్నంగా విడుదలైంది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా... లవ్, యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్‌లతో తెరకెక్కనుందని చిత్ర నిర్మాత వెల్లడించారు. ఈ సినిమాకు చెందిన రెండు పాటలను స్విట్జర్లాండ్‌లో చిత్రీకరించామని నిర్మాత తెలిపారు. ఇంకా ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫీ... శివ, సంగీతం.... మణిశర్మ. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ ద్వారా వీక్షించండి.
About Writer
Selvi