"గుండె ఝల్లుమంది" ట్రైలర్ మీ కోసం..
|
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ... తన మనసుకి నచ్చే మనసు తారసపడ్డప్పుడే స్పందన మొదలవుతుందని, అప్పుడు కురిసే ప్రేమ జల్లులో తడిసి ముద్దవ్వాల్సిందేనని అంటున్నారు. ఈ విషయాన్నే వినోదాత్మకంగా తెరకెక్కించామని వెల్లడించారు.
నిర్మాత మాట్లాడుతూ... యువతీ, యువకుల హృదయ స్పందనలకీ, సవ్వళ్లకు దర్పణం ఈ చిత్రమన్నారు. ఇంకా ఈ చిత్రంలో అజయ్, ఆహుతి ప్రసాద్, వేణుమాధవ్, ధర్మవరపు, సురేఖావాణి, మధుమణి తదితరులు నటిస్తున్నారు. కెమెరా... ప్రభాకర్ రెడ్డి, పాటలు.. శివశక్తి దత్తా, చైతన్య ప్రసాద్, సమర్పణ.. పరుచూరి కిరీటి. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీ కోసం...
