1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

"ఆదివిష్ణు"వును ట్రైలర్ రూపంలో వీక్షించండి

వినోదం వెండితెర ట్రైలర్స్  సిరిమీడియా ప్రైవేట్ లిమిటెడ్ బేనర్ డాక్టర్ దాసరి నారాయణరావు కుమారుడు దాసరి అరుణ్కుమార్ స్నేహ
WD
సిరిమీడియా ప్రైవేట్ లిమిటెడ్ బేనర్‌పై డాక్టర్. దాసరి నారాయణరావు కుమారుడు దాసరి అరుణ్‌కుమార్ హీరోగా నటించిన చిత్రం "ఆదివిష్ణు". స్నేహ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా భరత్ పారేపల్లి, పల్లి వేణుగోపాల్‌ల సంయుక్త దర్శకత్వంలో రూపుదిద్దుకుంది. మనీ, మజిల్ పవర్‌ల మధ్య జరిగే కథాంశంతో తెరకెక్కిన "ఆదివిష్ణు" సినిమా ఆడియోను సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆడియోను ఆవిష్కరించి మోహన్‌బాబుకు అందించారు.

దాసరి పద్మ నిర్మాత సారథ్యం వహిస్తున్న ఈ సినిమా ఆడియో సౌభాగ్య మీడియో ఆడియో సంస్థపై విడుదలై రూ.9.90 పైసలకే మార్కెట్లో లభిస్తోంది. సాఫ్ట్‌వేర్ రంగాన్ని కుదిపేస్తున్న వైరస్‌కు యాంటీవైరస్‌ను కనిపెట్టిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆదివిష్ణు, సమాజాన్ని పట్టిపీడిస్తున్న వైరస్ లాంటి టెర్రరిస్టులకు ఎటువంటి మందు కనిపెట్టాడన్న పాయింట్‌తో... ఈ సినిమా విడుదలై ప్రేక్షకుల మన్ననలను చూరగొంటోంది.

ఇకపోతే దాసరి నారాయణరావు కథ, స్త్ర్కీన్‌ప్లే సమకూరుస్తున్నఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీకోసం...
About Writer
Selvi