వెంకీ "చింతకాయల రవి" ట్రైలర్ మీ కోసం...
|
అన్ని కార్యక్రమాలు ముగించుకుని అక్టోబర్ 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా వెంకటేష్ చక్కగా నటించారని ఆయన చెప్పారు. వెంకటేష్ బాడీ లాంగ్వేజ్‌కు సరిపడా కథతో పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రముంటుందని నిర్మాత చెప్పారు. ఇటీవలే విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభించిందని, త్వరలో ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేయనున్నామన్నారు.
"లక్ష్మీ", "ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే", "తులసి" వంటి సినిమాల విజయంతో హ్యాట్రిక్ హీరోగా మారిన వెంకటేష్ "చింతకాయల రవి"గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కామెడీతో సాగే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
