గూఢాచారుల "హోమం" ట్రైలర్ మీ కోసం..
|
ఊహించని ట్విస్టులతో ప్రేక్షకుడికి థ్రిల్ అనుభూతిని కలిగిస్తుంది. ఇకపోతే... హీరోయిన్ సాక్షి శివానంద్ ఈ చిత్రంలో.. ఓ ఐటం సాంగ్‌లో కనపడి యువతను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. తెలుగు పరిశ్రమ గొప్ప అంచనాలతో ఎదురుచూసిన హాట్ సినిమా "హోమం"లో... పోలీసు అవ్వాలనే లక్ష్యంతో ఉండే వ్యక్తి పాత్రను జగపతిబాబు అద్భుతంగా పోషించారు.
విశ్వనాథం (ప్రదీప్‌రావత్) పోలీసు అధికారిగా నటించారు. కథా పరంగా... హైదరాబాద్‌లో ఎన్నో అరాచకాలు చేసినప్పటికీ, సరైన సాక్ష్యాలు లభించకపోవడంతో ఒక ముఠా నాయకుడు డాడీ (మహేష్ మంజ్రేకర్)ని విశ్వనాథం అరెస్టు చేయలేకపోతాడు. తన చీకటి సామ్రాజ్యానికి అడ్డులేకుండా చేసుకోవడానికి డాడీ కూడా ఒక వ్యక్తిని పోలీసు డిపార్ట్‌మెంట్‌లో నియమిస్తాడు.
ఈ పాత్ర పేరే చందు (జేడీ చక్రవర్తి). ఈ పాత్రలో జె.డి. చక్రవర్తి చక్కగా అమరారు. ఇకపోతే మమతా మోహన్‌దాస్ పాత్రకు కథాపరంగా ప్రాధాన్యం లేకపోయినా హీరోయిన్‌గా జగపతి బాబు సరసన చక్కగా నటించింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో తిలకించండి.
