"కాశీపట్నం చూడరబాబు..!" ట్రైలర్ మీ కోసం..
|
గ్రామజీవన బ్యాక్‌డ్రాప్‌లో ఎంటర్‌టైనర్‌గా ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. చివరి పాట షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను అక్టోబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తునట్లు నిర్మాత వెల్లడించారు.
మద్దిరాల వెంకట్‌ను ఈ సినిమాకు దర్శకుడిగా పరిచయం చేస్తున్నామని అన్నారు. సీనియర్ డైరక్టర్ వంశీ దర్శకత్వం వహించిన అనేక సినిమాల్లో వెంకట్ పనిచేశారని చెప్పారు.
ఇకపోతే... తనికెళ్ల భరణి, కృష్ణభగవాన్, ఎం.ఎస్. నారాయణ, గుండు సుదర్శన్, సారిక, జయలలిత, నిఖిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు... రచయిత. మోహన్, కెమేరా... జవహర్ రెడ్డి, సంగీతం... చక్రి. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ట్రైలర్ ద్వారా వీక్షించండి.
