1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

వినాయకుడు ట్రైలర్‌ను తిలకించండి

వినోదం వెండితెర ట్రైలర్స్ వినాయకుడు కృష్ణుడు సోనియా ప్రేమ్ మూవీస్ పతాకం సాయికిరణ్ దర్శకత్వం
కృష్ణుడు, సోనియా జంటగా నటిస్తోన్న చిత్రం "వినాయకుడు". ప్రేమ్ మూవీస్ పతాకంపై సాయికిరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సరితా పట్రా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని నిర్మాణానంతర కార్యక్రమాలను ముగించుకుని త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమర్పకుడు ప్రేమ్ కుమార్ తెలిపారు.

రొమాన్స్, కామెడీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కనుందని ప్రేమ్ అన్నారు. వినోదాన్ని పుష్కలంగా పండిస్తున్న ఈ సినిమాకు శ్యామ్ ప్రసన్న సంగీతం హైలైట్‌గా నిలుస్తుందని ఆయన వెల్లడించారు.

ఈ సినిమా ఆడియో వేడుక వినాయకచవితి రాత్రి శిల్పకళామందిరంలో వినూత్నంగా జరిగింది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా వినాయకుడు ఉంటాడని ప్రేమ్ కుమార్ చెప్పారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్‌ ద్వారా తిలకించండి.
About Writer
Selvi