"రెయిన్ బో"ను ట్రైలర్‌లో తిలకించండి
|
యువతరాన్ని ఆకట్టుకునే అన్ని అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయని వి.ఎన్. ఆదిత్య వెల్లడించారు. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు ఆనందపు హరివిల్లులో తడిసి ముద్దవుతారని చెప్పారు.
లక్ష్యంవైపు అడుగిడే ప్రయత్నించే కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో, సోనాలీ చౌహాన్ విభిన్న పాత్రను పోషిస్తోందని ఆదిత్య చెప్పారు. దర్శకులు రాజమౌళి, శ్రీను వైట్ల, కోడి రామకృష్ణ, వి. సముద్ర నిజజీవిత పాత్రలనే ఈ సినిమాలో పోషించడం ప్రత్యేకమని ఆయన అన్నారు.
నేపథ్యగాయకుడు నిహాల్ తొలిసారిగా ఈ చిత్రానికి చక్కటి సంగీతాన్ని సమకూర్చారని, ఇప్పటికే విడుదలైన ఈ సంగీతానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందన్నారు.
పరుచూరి వెంకటేశ్వర రావు, గొల్లపూడి మారుతీ రావు, ధర్మవరపు, సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్. సత్యనారాయణ, సునీల్, ఉత్తేజ్, కొండవలస, లక్ష్మణ రావు తదితరులు నటిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ట్రెయిలర్ రూపంలో మీ కోసం...
