గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » ట్రైలర్స్ » గోపిచంద్ "శౌర్యం" ట్రైలర్‌ను తిలకించండి
ట్రైలర్స్
Feedback Print Bookmark and Share
 
FILE
శివకుమార్ దర్శకత్వంలో లక్ష్యం" జంట గోపిచంద్, అనుష్క హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం "శౌర్యం". షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల (సెప్టెంబర్) 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. భవ్య క్రియేషన్స్ పతాకంపై రూపుదిద్దుకున్న ఈ సినిమాను ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

ఇటీవలే వినూత్నంగా విడుదలైన ఈ సినిమా ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించిందని నిర్మాత ఆనంద్ ప్రసాద్ వెల్లడించారు. లవ్, యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్‌లతో తెరకెక్కనున్న ఈ సినిమాకు చెందిన రెండు పాటలను స్విట్జర్లాండ్‌లో చిత్రీకరించామని నిర్మాత తెలిపారు.

ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్ అంశాలు మిళితమైన ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున అలరిస్తుందని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు. "లక్ష్యం" సినిమా డైలాగ్స్‌కు క్లాప్ కొట్టించిన "రత్నం" ఈ చిత్రానికి పనిచేయడం ప్లస్‌గా భావిస్తున్నట్లు ఆడియో రిలీజ్ కార్యక్రమంలో హీరో గోపిచంద్ చెప్పారు. సినిమాటోగ్రాఫీ... శివ, సంగీతం.... మణిశర్మ. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో తిలకించండి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర ట్రైలర్స్ శివకుమార్ గోపిచంద్, అనుష్క హీరోహీరోయిన్లు శౌర్యం