1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

"బలాదూర్‌"ను ట్రైలర్లో వీక్షించండి

వినోదం వెండితెర ట్రైలర్స్ రవితేజ సూపర్ స్టార్ కృష్ణ అనుష్క కాంబినేషన్ బలాదూర్ వీడికి బాధ్యతలెక్కువ
రవితేజ, సూపర్ స్టార్ కృష్ణ, అనుష్క కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "బలాదూర్" (వీడికి బాధ్యతలెక్కువ). సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కుటుంబకథా చిత్రంగా రూపొందిన ఈ సినిమాకు సురేష్ బాబు నిర్మాణ సారథ్యం వహించారు.

"బాధ్యతలు లేకుండా బలాదూర్‌గా తిరిగే ఓ కుర్రాడు"... తన బాధ్యత ఏమిటో తెలుసుకుని ఇంటిని ఎలా చక్కదిద్దాడనే పాయింట్‌తో దర్శకుడు ఉదయ్ శంకర్ అద్భుతంగా తెరకెక్కించారు.

రవితేజ బాడీలాంగ్వేజ్ సరిపడా కథతో, కుటుంబ సంబంధాలు, సెంటిమెంట్‌‌ కళ్లకు కట్టినట్లుగా దర్శకుడు చక్కగా రూపొందించారు. కథాపరంగా చూస్తే... సుఖసంతోషాలకు నిలయమైన ఉమ్మడి కుటుంబంలో... సూపర్ స్టార్ కృష్ణ (రామకృష్ణుడు) కూతురి వివాహం రవితేజ (చంటి) వల్లే పెటాకులవుతుంది.

దీనితో రవితేజ ఇంటికి దూరమవుతాడు. ఈలోగా "చంటి" కుటుంబంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. తన కుటుంబంలో ఏర్పడిన రకరకాల మార్పులను బయటనుంచే "చంటి" (రవితేజ) ఎలా పరిష్కరించాడనే పాయింట్‌తో బలాదూర్ తెరకెక్కింది.

ఒకవైపు రవితేజ యాక్షన్ యూత్‌ను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటుండగా, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అయిన బలాదూర్‌ను మహిళలు పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు. ఇటీవలే విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోన్న ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో తిలకించండి.
About Writer
Selvi