"గుండెఝల్లుమంది" ట్రైలర్ మీ కోసం...
తన మనసుకి నచ్చే మనసు తారసపడ్డప్పుడే స్పందన మొదలవుతుందని, అప్పుడు కురిసే ప్రేమ జల్లులో తడిసి ముద్దవ్వాల్సిందేనని "గుండెఝల్లుమంది" దర్శకుడు మదన్ అంటున్నారు. ఈ విషయాన్నే వినోదాత్మకంగా తెరకెక్కించామని, ఇటీవలే విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల గుండెలను ఝల్లుమనిపిస్తోందని మదన్ ఆశాభావం వ్యక్తం చేశారు. యువతీ, యువకుల హృదయ స్పందనలకీ, సవ్వళ్లకు దర్పణం ఈ చిత్రమని నిర్మాత అన్నారు.
ఇకపోతే ఉదయ్ కిరణ్, అదితి శర్మ హీరోహీరోయిన్లుగా నటించి తెరకెక్కిన సినిమాను పరుచూరి శివరామ కృష్ణ నిర్మించారు. ఎం.ఎం. కీరవాణి సంగీత సారథ్యం వహించిన ఈ సినిమా విడుదలై యూత్‌ను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విడుదలైన ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించిందని యూనిట్ వెల్లడించింది.
అజయ్, ఆహుతి ప్రసాద్, వేణుమాధవ్, ధర్మవరపు, సురేఖావాణి, మధుమణి తదితరులు నటించిన ఈ సినిమాకు కెమెరా... ప్రభాకర్ రెడ్డి, పాటలు.. శివశక్తి దత్తా, చైతన్య ప్రసాద్, సమర్పణ.. పరుచూరి కిరీటి. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీ కోసం...