1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

"కళ్యాణం" ట్రైలర్‌ను తిలకించండి

వినోదం వెండితెర ట్రైలర్స్ చందు జ్యోత్స సంయోగితలు హీరో
WD
చందు, జ్యోత్స, సంయోగితలు హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం "కళ్యాణం". మురళీకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శ్రీకర్ ఫిలింక్రాఫ్ట్ పతాకంపై రూపుదిద్దుకుంటోంది. అలనాటి సూపర్ హిట్ మూవీ "లవకుశ"లో కుశుడు పాత్రను పోషించిన సుబ్రమణ్యం, ఈ సినిమాలో హీరోకు తండ్రి పాత్రను పోషించడం విశేషం. చక్కని ఫ్యామిలీ అండ్ యూత్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.

డా. కె కృష్ణ ప్రసాద్ సమర్పణలో వస్తున్న ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ... పాత చిత్రాల పాటలను గుర్తుకు తెచ్చేవిధంగా రెండు పాటలుంటాయని అన్నారు. ఆ రెండు పాటలే చిత్రానికి హైలెట్‌గా నిలుస్తాయని చెప్పారు.

ఇంకా ఈ చిత్రంలో పిళ్లాప్రసాద్, చిన్నా, రామిరెడ్డి, దిల్ రమేష్, గుండు హనుమంతరావు, ఆనంద్, గౌతంరాజు, జూ. రేలంగి, సుబ్బరావు, తదితరులు నటిస్తున్నారు. పాటలు... పోతుల రవికిరణ్, గురుచరణ్, సంగీతం... కనకేశ్ రాథోడ్, కెమెరా... గాదిరాజు శ్రీనివాస్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం... మురళీకృష్ణ.

ఈ చిత్రంలోని కొన్ని మధుర సన్నివేశాలు మీకోసం ట్రైలర్ రూపంలో... వీక్షించండి.
About Writer
Selvi