1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

"మల్లెపువ్వు‌"ను ట్రైలర్‌‌లో వీక్షించండి

వినోదం వెండితెర ట్రైలర్స్ మురళీ కృష్ణ భూమిక మల్లెపువ్వు పరిమళాల గుబాళింపు ఇళయరాజా సంగీతం
మురళీ కృష్ణ, భూమిక హీరోహీరోయిన్లుగా నటించి తెరకెక్కిన చిత్రం "మల్లెపువ్వు". ఇటీవలే విడుదలైన ఈ "మల్లెపువ్వు" ప్రేక్షకులకు పరిమళాల గుబాళింపును అందజేస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం సమకూర్చడం, అందాల ముద్దుగుమ్మ ఫర్జానా ఐటం సాంగ్ చేయడం ఈ సినిమా ప్రత్యేకాంశాలు.

మోహన్ వడ్లపట్ల నిర్మాణ సారథ్యం వహిస్తున్న ఈ సినిమా ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించిందని, అదే విధంగా "మల్లెపువ్వు" కూడా ప్రేక్షకులను అలరిస్తుందని దర్శకుడు వి. సముద్ర ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో భూమిక కీలక పాత్ర పోషించిందని, ఆమె కెరీర్‌లో "మల్లెపువ్వు" మంచి సినిమా అవుతుందని అన్నారు. హీరోగా పరిచయం అవుతున్న మురళీ కృష్ణ పాత్రకు చక్కగా అమరారని తెలిపారు.

ఇకపోతే... చిత్ర దర్శకుడు వి. సముద్ర ఇందులో హీరోకు స్నేహితుడిగా నటించారు. చక్కని మల్లెపువ్వుకు దర్శకుడు టెర్రరిజం జోడించాడు. ఇంకా ఈ సినిమాకు పాటలు... వేటూరి, కథ.. రమేష్ వర్మ, ఛాయాగ్రహణం... అనిల్ భండారి. లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన "మల్లెపువ్వు"ను ట్రైలర్‌లో తిలకించండి.
About Writer
Selvi