1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

"ఏకలవ్‌యుడు"ను ట్రైలర్లో తిలకించండి

వినోదం వెండితెర ట్రైలర్స్ నరసింహనాయుడు మేడికొండ మురళీకృష్ణ ఉదయ్కిరణ్ ఏకలవ్యుడు శ్రీ వెంకట రమణ ఫిలింస్ పతాకం కెఆర్కె దర్శకత్వం
యూత్ హీరో ఉదయ్‌కిరణ్ కథానాయకుడిగా... సూపర్ సెన్సేషనల్ హిట్ "నరసింహనాయుడు" చిత్ర నిర్మాత మేడికొండ మురళీకృష్ణ సమర్పణలో రూపుదిద్దుకుంటున్న చిత్రం "ఏకలవ్‌యుడు".

శ్రీ వెంకట రమణ ఫిలింస్ పతాకంపై కె.ఆర్.కె. దర్శకత్వంలో, యువ నిర్మాత మేడికొండ అమర్‌చంద్ ప్రొడక్షన్ నెం-10గా నిర్మిస్తోన్న "ఏకలవ్‌యుడు" సినిమా త్వరలో లవ్‌లీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. అనిల్ కృష్ణ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ సినిమా ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించింది.

ఈ సందర్భంగా హీరో ఉదయ్‌కిరణ్ మాట్లాడుతూ... "ఏకలవ్‌యుడు" అనే డిఫరెంట్ టైటిల్‌తో... కథే ప్రధానంగా రూపుదిద్దుకుంటున్న చిత్రమిదన్నారు. ఒక కమర్షియల్ సినిమాలో ఉండాల్సిన అన్ని అంశాలు కరక్ట్ ప్లేస్‌మెంట్స్‌లో ఉండేలా డైరక్టర్ కె.ఆర్.కె. చాలా జాగ్రత్త తీసుకున్నారని చెప్పారు.

డెప్త్, ఎమోషన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ అంశాలతో త్వరలో ప్రేక్షకుల ముందుకురానున్న "ఏకలవ్‌యుడు" విడుదలైతే అనిల్‌కృష్ణ చాలా పెద్ద మ్యూజిక్ డైరక్టర్ అవుతారని నిర్మాత మేడికొండ అన్నారు. ఉదయ్‌కిరణ్‌కు ఈ సినిమా గుర్తింపును సాధించిపెడుతుందని, హీరోయిన్ కృతి పాత్రకు తగ్గట్టు చక్కగా అమరిందని తెలిపారు.

ఊటీ బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకుని త్వరలో తెరపైకి రానున్న ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
About Writer
Harsha Vardhan