1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

నితిన్ "హీరో" ట్రైలర్‌ను వీక్షించండి

వినోదం వెండితెర ట్రైలర్స్ నితిన్ భావన నాగబాబు రమ్యకృష్ణ జోడీ విలన్ జీవి మన్యం రమేష్ హీరో సై బావగారు బాగున్నారా
నితిన్, భావన హీరోహీరోయిన్లుగా, నాగబాబు, రమ్యకృష్ణ జోడీగా నటిస్తున్న చిత్రం "హీరో". ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన ఈ సినిమా ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించింది. మన్యం ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మన్యం రమేష్ నిర్మిస్తోన్న చిత్రానికి పలు చిత్రాల్లో విలన్‌గా నటించిన జీవి దర్శకునిగా పరిచయమవుతున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మన్యం రమేష్ మాట్లాడుతూ... "బావగారు బాగున్నారా" నుంచి నాగబాబు సినిమాలకు పనిచేశానని, వారి సహాయంతో "ముని" చిత్రాన్ని రూపొందించామని అన్నారు.

తొలిసారిగా హీరోతో "హీరో" చేశానని, నటుడు అయిన జి.వి. సుధాకర్ నాయుడు తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్నారని వెల్లడించారు. ఆయన చెప్పిన కథ బాగా నచ్చిందని, హీరోతో పాటు హీరోయిన్‌కూ ప్రాధాన్యత గల కథ ఇదని, "ఒంటరి" తర్వాత భావన ఈ చిత్రంలో నటించదన్నారు. నాగబాబు, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారని చెప్పారు.

నితిన్ మాట్లాడుతూ... "సై" సినిమా అంతటి స్టైలిష్‌గా కనబడుతానని, పాత్రపరంగా తన హెయిర్ స్టైల్, చేతికిగాటు స్పోర్ట్స్ బైక్ ఉంటాయని అన్నారు. బాలీవుడ్ తరహాలో ఈ చిత్రముంటుందని తెలిపారు.

దర్శకుడు జీవీ మాట్లాడుతూ... పలు భాషల్లో 150 చిత్రాల్లో నటించానని, అయినా ఏదో తెలీని వెలితి కన్పించేదని, తనకొచ్చిన ఆలోచనలతో ఓ కథను రెడీ చేసుకుని, దానికి తగ్గ హీరోగా నితిన్‌ను ఎంపిక చేసినట్లు అన్నారు. తన టాలెంట్ గుర్తించి రమేష్ దర్శకునిగా అవకాశం కల్పించారని జీవీ వెల్లడించారు. ఇందులో నితిన్ కొత్తగా కన్పిస్తాడని ఆయన అన్నారు.

అమాయకత్వం ఉట్టిపడే పాత్రలో ఒంటరి ఫేమ్ భావన నటిస్తున్న హీరో సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ ద్వారా వీక్షించండి.
About Writer
Harsha Vardhan