1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

తేజ "కేక"ను ట్రైలర్లో తిలకించండి

వినోదం వెండితెర ట్రైలర్స్ జయం చిత్రం తేజ కేక ఆదిత్య మ్యూజిక్ 36 మంది కొత్త ఆర్టిస్టులు చక్రి సంగీతం పిసి శ్రీరామ్ కెమెరా వీధిబాలల స్టోరీ
జయం", "చిత్రం" వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన "తేజ" తాజా సినిమా "కేక". ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదల చేశారు. భారీ అంచనాలతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో దాదాపు 36 మంది కొత్త ఆర్టిస్టులు నటిస్తున్నారు.

"చిత్రం" మూవీస్ పతాకంపై తెరకెక్కనున్న "కేక" సినిమాకు చక్రి సంగీతం సమకూర్చారు. పి.సి. శ్రీరామ్ కెమెరా పనితనం "కేక" సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని సినీ వర్గాల్లో టాక్.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు తేజ మాట్లాడుతూ... చిత్రం మూవీస్ బేనర్‌లో సినిమా చేసి ఐదేళ్లయిందన్నారు. మొట్ట మొదటిసారిగా సంగీతదర్శకుడు చక్రితో కలిసి పనిచేశానని వెల్లడించారు. ఇందులో ఆరు పాటలున్నాయని, తన వరకు చాలా సంతృప్తికరమైన ట్యూన్స్ ఇచ్చారని, ఇంతకుముందు చిత్రాల్లో ఒకటో, రెండో పాటలు బాగుండేవి కావని, కానీ "కేక"లో అన్ని పాటలు బాగున్నాయని చెప్పారు.

ఇందులో 40 మంది పిల్లలున్నారని, అందులో నలుగురు హైదరాబాదీయులు, మిగిలిన వారు బెంగాలీయులు నటిస్తున్నారని అన్నారు. "కేక" వీధిబాలల స్టోరీ అని, వారి జీవనపోరాటం, ఆకలి, ప్రేమ, చీటింగ్, ఫైట్స్ ఇలా అన్నీ రకాల ఎమోషన్స్ కలిసిన కథ ఇదని, తెలుగు సినిమాలోనే కొత్త ఫార్మెట్‌లో ఈ చిత్రాన్ని తీశానని తేజ చెప్పారు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్లో వీక్షించండి.
About Writer
Harsha Vardhan