1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

సస్పెన్స్ థ్రిల్లర్‌ "ట్రెర్రర్" ట్రైలర్ మీ కోసం...

వినోదం వెండితెర ట్రైలర్స్ నవనీత్ కౌర్ టెర్రర్ నిషానేహా ప్రొడక్షన్ ఏఏఆర్ట్స్ బ్రహ్మాజీ
నవనీత్ కౌర్ ప్రధాన పాత్రపోషిస్తోన్న చిత్రం "టెర్రర్". నిషానేహా ప్రొడక్షన్ అనే నూతన నిర్మాణ సంస్థ ఏఏ.ఆర్ట్స్‌తో కలిసి సంయుక్తంగా సినిమాను నిర్మిస్తోంది. బ్రహ్మాజీ, ప్రభాకర్, విజయ్ చందర్, సమీర్, నిళల్‌గళ్ రవి, అభినయశ్రీ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

చిత్రం గురించి సహా నిర్మాత ఎఎఎన్.శాస్త్రి మాట్లాడుతూ... ఎఎ.ఆర్ట్స్‌తో కలిసి పని చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిందని, పోస్ట్‌ప్రొడక్షన్స్ జరుగుతున్నాయని వెల్లడించారు.

నవనీత్ కౌర్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో తాను డాన్సులతో పాటు రిస్కీ‌ఫైట్లు కూడా చేశానని చెప్పారు. ఈ సినిమా ద్వారా తనకు మాస్, యాక్షన్ హీరోయిన్‌గా మంచి పేరు వస్తుందన్నారు.

పలు థ్రిల్లింగ్ అంశాలతో రూపొందే ఈ చిత్రంలో విజయ్‌ చందర్ పాత్ర అద్భుతంగా ఉంటుందని, సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించామని దర్శకుడు సంజీవ తెలిపారు

ఈ చిత్రానికి కెమెరా.. అడుసుమిల్లి విజయ్ కుమార్, రచన.. వెలిగొండ శ్రీనివాస్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం.. ఎల్.సంజీవ. ఈ సినిమాలోని నవనీత్ కౌర్ యాక్షన్ సన్నివేశాలను మరికొన్ని ఆహ్లాదరకరమైన సీన్లను ట్రైలర్ ద్వారా వీక్షించండి.
About Writer
PNR