1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

"వినాయకుడు"ను ట్రైలర్లో వీక్షించండి

వినోదం వెండితెర ట్రైలర్స్ రొమాన్స్ కామెడీ  కృష్ణుడు సోనియా వినాయకుడు ప్రేమ్ మూవీస్ పతాకం సాయికిరణ్ సరితా పట్రా
రొమాన్స్, కామెడీ అంశాలతో కృష్ణుడు, సోనియా జంటగా నటిస్తోన్న చిత్రం "వినాయకుడు". ప్రేమ్ మూవీస్ పతాకంపై సాయికిరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సరితా పట్రా నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని నిర్మాణానంతర కార్యక్రమాలను ముగించుకుని త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని సమర్పకుడు ప్రేమ్ కుమార్ తెలిపారు. వినోదాన్ని పుష్కలంగా పండిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ ప్రసన్న సంగీతం హైలైట్‌గా నిలుస్తుందని ఆయన తెలిపారు.

ఈ సినిమా ఆడియో విడుదల వినాయకచవితి రాత్రి శిల్పకళామందిరంలో వినూత్నంగా జరిగింది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా వినాయకుడు ఉంటాడని ప్రేమ్ కుమార్ చెప్పారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్‌ ద్వారా వీక్షించండి.
About Writer
PNR