గోపిచంద్ "శౌర్యం"ను ట్రైలర్లో తిలకించండి
భవ్య క్రియేషన్స్ పతాకంపై "లక్ష్యం" జంట గోపిచంద్, అనుష్క హీరోహీరోయిన్లుగా నటించి తెరకెక్కిన చిత్రం "శౌర్యం". శివకుమార్ దర్శకత్వంలో ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాకు నిర్మాణ సారథ్యం వహించారు. లవ్, యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్‌లతో తెరకెక్కిన ఈ సినిమా ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించిందని చిత్ర యూనిట్ వెల్లడించింది.
కథాపరంగా చెప్పాలంటే.. పోలీసు అధికారికి, రౌడికి మధ్య జరిగే రణమే "శౌర్యం" సినిమా అని చెప్పవచ్చును. దీనికి కాస్త సోదరి సెంటిమెంట్‌ను కూడా జోడించారు. కలకత్తాలోని ఓ కళాశాలలో చదువుతున్న తన చెల్లెలను హీరో గోపిచంద్ ఎలా రక్షిస్తాడన్నదే చిత్ర కథ. కథాగమనంలో సస్పెన్స్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది.
మణిశర్మ సంగీతం సమకూర్చిన ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో చూద్దామా?