1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

"ఉల్లాసంగా... ఉత్సాహంగా..." ట్రైలర్ మీకోసం...

వినోదం వెండితెర ట్రైలర్స్ యశోసాగర్ హీరో స్నేహఉల్లాల్ అమృత్ అమరనాథ్ ఆర్ట్స్ కరుణాకర్ పవన్కళ్యాణ్ తొలిప్రేమ
యశోసాగర్ హీరోగా, స్నేహఉల్లాల్ హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం "ఉల్లాసంగా... ఉత్సాహంగా..." అమృత్ అమరనాథ్ ఆర్ట్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి కరుణాకర్ దర్శకుడు. గతంలో పవన్‌కళ్యాణ్ హీరోగా వచ్చిన "తొలిప్రేమ" చిత్రం ద్వారా కరుణాకర్ దర్శకుడిగా పరిచయమైన విషయం తెలిసిందే.

అటుపై పలు హిట్ చిత్రాలకు దర్శకునిగా పనిచేసిన కరుణాకర్ తాజా సినిమా "ఉల్లాసంగా... ఉత్సాహంగా" విడుదలై ప్రేక్షకుల మన్ననలను చూరగొంటుంది.

కథాపరంగా చెప్పాలంటే... చిన్నతనంలో స్నేహితులుగా ఉన్న హీరోహీరోయిన్లు, తరువాత విడిపోయి పెద్దయ్యాక ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే పాయింట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. "మనసంతా నువ్వే", "తొలిప్రేమ" వంటి చిత్రాల ఛాయలు కన్పించినా దర్శకుని పనితీరు, సంగీతం ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి.

ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, చంద్రమోహన్, ధర్మవరపు, సునీల్, వేణుమాధవ్, రఘుబాబు, ఎల్.బి.శ్రీరామ్, అనంత్, సుమన్‌శెట్టి తదితరులు నటించారు.

జి.వి. ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించింది. థియేటర్లలో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్న "ఉల్లాసంగా... ఉత్సాహంగా.." చిత్రంలోని కొన్ని మధురమైన సన్నివేశాలు మీకోసం..
About Writer
PNR