నితిన్ "హీరో" ట్రైలర్ మీకోసం...
నితిన్, భావన హీరోహీరోయిన్లుగా నాగబాబు, రమ్యకృష్ణ జంటగా నటిస్తున్న చిత్రం "హీరో". మన్యం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మన్యం రమేష్ నిర్మించిన ఈ చిత్రానికి సుధాకర్ నాయుడు (జీవీ) దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ... సందర్భానుసారంగా ఐదు పాటలున్నాయని, అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉంటుందని తెలిపారు. శాస్త్రీయ సంగీతానికి పాశ్చాత్యతను జోడించి చేసిన పాట ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందన్నారు.
మణిశర్మ సంగీతం సమకూర్చిన ఈ సినిమా పాటలకు శ్రోతలను మంచి స్పందన లభించిందన్నారు. అలాగే సినిమా కూడా ప్రేక్షకుల మన్ననలను పొందుతుందని నిర్మాత రమేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.
మణిశర్మ మెలోడి చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని, ప్రస్తుతం ఫైనల్ మిక్సింగ్, డి.ఎ వంటి కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 23న సినిమాను విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈ సినిమాలోని కొన్ని మధురమైన సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.